టాలీవుడ్‌లో భారీ సినిమాల బిజినెస్‌లో తన వ్యూహాలతో గుర్తింపు పొందిన నిర్మాత దిల్ రాజు.. తాజాగా ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రామాయణం’పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ మార్కెట్‌లో భారీ వసూళ్లకు అవకాశం ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఆయన పెట్టుబడి పెట్టనున్నారనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.
ఇక యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ తెలుగు హక్కుల విషయంలోనూ దిల్ రాజు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. దాదాపు రూ.75 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు తెలుస్తుండగా.. ‘రీఫండబుల్ బేసిస్’పై ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే పెట్టుబడిని నిర్మాతలు తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఈ విధానం వల్ల సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా దిల్ రాజుకు నష్టం తగ్గే అవకాశం ఉంటుంది. భారీ చిత్రాలపై పెట్టుబడులు పెడుతున్న ఆయన.. ఇప్పుడు ‘రామాయణం’తో మరో పెద్ద బిజినెస్ డీల్‌కు సిద్ధమవుతున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ డీల్‌పై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.









