దక్షిణాది నుంచి ప్రధాని అభ్యర్థిగా విజయ్..?

దక్షిణాది నుంచి ప్రధాని అభ్యర్థిగా విజయ్…?

తమిళ్ నాడులో మొన్నామధ్య జరిగిన ఎన్నికలలో సర్వే లను తోసిరాజని ప్రముఖ తమిళ హీరో విజయ్ అనూహ్యంగా సీఎం పీఠం అధిరోహించిన విషయం తెలిసిందే.. కాగా ఆయన సీఎం అయిన అనంతరం తీసుకున్న సంచలన నిర్ణయాలతో తమిళ ప్రజల మనసులను గెలిచారు.

ఇప్పుడు తాజాగా,ఇండియా టుడే – సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాన మంత్రి అభ్యర్థులుగా మోదీ , రాహుల్ గాంధీ తర్వాత టీవీకే అధినేత విజయ్ మూడో స్థానంలో నిలిచారు.తమిళనాడులో సంపాదించిన ప్రాంతీయ మద్దతుతో పాటు, పాన్-ఇండియా సినిమాల ద్వారా ఉత్తరాది యూత్ ,జెన్ జీ ఓటర్లలో విజయ్‌కి ఉన్న క్రేజ్ ప్లస్ పాయింట్‌ అయ్యిందని రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు…

ప్రతిపక్ష కూటమి నాయకత్వ రేసులో 12.2% తో రాహుల్ తర్వాత 2వ స్థానంలో విజయ్ నిలిచారు. ఢిల్లీ పీఠంపై సౌత్ నేత కూర్చోవాలనే లక్ష్యంతో TVK ప్లాన్ వర్కవుట్ అవుతోందా?… ఆ కల విజయ్ ద్వారా  నెరవేరబోతొందా? అనేది వేచి చూడాలి…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు