ఎమ్మెల్సీపై ఎంఐఎం వేటు.. వెంటనేరాజీనామాకు ఆదేశం..
వివాదంలో చిక్కుకున్న తెలంగాణ ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, మండలి ఛైర్మన్‌కు లేఖ పంపాలని ఆదేశించింది.
2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్ బేగ్ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ.. పార్టీ నిర్ణయంతో ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ మీర్జా రహ్మత్ బేగ్ పట్టుబడ్డారంటూ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. కాగా ఆ ఆరోపణలపై స్పందించిన ఎంఐ ఎం పార్టీ అధినేత ఒవైసీ ఎమ్మెల్సీ బేగ్ పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా, పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేశారు.
ఇది ఇలా ఉంటే, ఈ ఘటనపై పలు ఆరోపణలు చేసిన ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ ఆలీ , అత్తాపూర్‌లో కొందరు యువకులు ఆయనను పట్టుకుని కొట్టి, వీడియోలు తీశారన్నారు.ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని, అయినా రహ్మత్ బేగ్‌ను ఉమ్రాకు పంపించారని సబ్దర్ అలీ ఆరోపించారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు.
MIM ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తూ దొరికిపోయాడని జర్నలిస్ట్ ఆలీ ఆరోపణలు చేశారు మీర్జా రహ్మత్ బేగ్ అత్తాపూర్‌లో మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేస్తుంటే కొందరు యువకులు పట్టుకొని కొట్టి, వీడియోలు తీశారన్నారు.
•ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అకృత్యాల గురించి హైదరాబాద్ సిటీ మొత్తం తెలియాలి… సల్మాన్ ఖాన్..
ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అకృత్యాల గురించి హైదరాబాద్ సిటీ మొత్తం తెలియాలన్నారు సల్మాన్ ఖాన్, అతన్ని MIM పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అసదుద్దీన్ ఒవైసీ తన నోటితోనే చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.ఈ కేసులో ఒక MIM ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ కూడా ఉన్నారు.. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ..అసదుద్దీన్ ఒవైసీ ఏమో హిజాబ్ గురించి మాట్లాడుతూ, ఆడవారితో గౌరవంగా ప్రవర్తించాలని అంటారు, వాళ్ల నాయకులు మాత్రం ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తారు అని విమర్శించారు సల్మాన్ ఖాన్.తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ అసదుద్దీన్ ఒవైసీ ముందు ఉంచుతానని .. వాళ్ల అకృత్యాలను అతని నోటితోనే చెప్పాలన్నారు .సల్మాన్









