సౌదీ అరేబియాకు 5 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్..! ముదురుతున్న యుద్ద మేఘాలు..

ఇరాన్‌తో ఉద్రిక్తతలు, ప్రాంతీయ పోరాటాలు పరాకాష్టకు చేరిన తరుణంలో, గల్ఫ్ మిత్రదేశమైన సౌదీ అరేబియాకు 5 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక బాంబులు, గైడెన్స్ కిట్లు, రక్షణ పరికరాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ దళాలు, యెమెన్‌లోని హూతీ రెబెల్స్ నుంచి నిరంతరం ఎదురవుతున్న క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టేలా సౌదీ అరేబియా వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాషింగ్టన్ ప్రకటించింది.

అమెరికా భద్రతా ప్రయోజనాలకు అనుగుణంగా, నాటోయేతర కీలక భాగస్వామియైన సౌదీ రక్షణను బలోపేతం చేయడంలో భాగంగానే ఈ ఒప్పందం కుదిరినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ ప్రతిపాదిత ఆయుధాల విక్రయంపై అగ్రరాజ్యం ఇప్పటికే తన కాంగ్రెస్‌కు అధికారిక సమాచారం అందించింది. పశ్చిమాసియాలో దాడులు తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు