భద్రాచలంలో గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ఆత్మ హత్య.. వేధింపులంటూ లేఖలో సంచలన ఆరోపణలు

భద్రాచలంలో  పాల్వంచ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ఆత్మ హత్యకు పాల్పడ్డారు .. తన మృతికి కారణం వేధింపులంటూ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో  పాల్వంచకు చెందిన గ్యాస్ ఏజెన్సీ మేనేజర్  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.దసరా పండుగ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న వారు సైతం తనను తీవ్రంగా వేధించినట్లు లక్ష్మీనారాయణ లేఖలో ఆరోపించినట్లు సమాచారం అందుతోంది.

చిన్న ఖర్చుల పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు