కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కీలక సూచనలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం–1995 ప్రకారం ప్రోగ్రామ్ కోడ్‌ను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని, హింసాత్మక దృశ్యాల ప్రసారంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. లైంగిక నేరాల బాధితుల గుర్తింపును వెల్లడించకూడదని, భారతదేశ అధికారిక మ్యాప్‌లనే ఉపయోగించాలని స్పష్టం చేసింది.
ఇది ఇలా ఉంటే,మత విద్వేషాలు రెచ్చగొట్టే, దేశ వ్యతిరేక కంటెంట్‌కు తావివ్వొద్దని ఆదేశించింది. ఏఐ టూల్స్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వార్తల ప్రసారంలో ఎడిటోరియల్ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని కేంద్రం ఛానల్ యాజమాన్యాలకు సూచించింది.
Post Views: 5









