ఆధార్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయలేదా? అయితే ఆధార్ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు త్వరలో ముగియనుంది. 2023 డిసెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే తగిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.









