- కాంగ్రెస్ లో సీఎం ఎవరు?
- ప్లాన్ బి గా కర్ణాటక పార్ములా!
- పదేళ్ల తరువాత అధికారాన్ని వదులుకోకూడదు.
- భట్టికి కలిసి వస్తున్న పరిస్థితులు.
- దళిత ముఖ్యమంత్రి హామీ నేరావెరానుందా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్య మంత్రి పదవి ఎవరికి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ.తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 64కు స్థానాలు గెలుపు దాదాపు ఖరారైంది.ఈ నేపాథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది.పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే దక్కుతుందని అందరు భావిస్తున్నారు.కానీ అధిష్ఠానం మదిలో ఏముంది ?అనేది మాత్రం అంతు చిక్కడం లేదని పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు.అయితే రేవంత్ రెడ్డీ కి వ్యతరేకంగా ఓ వర్గం అప్పుడే పావులు కదుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ వైపు ముఖ్య మంత్రి ఎవరికి ఇస్తారు అనేది అధిష్ఠానం నిర్ణయం అని చెబుతూనే మరో వైపు రేవంత్ కు చెక్ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమస్య ను ఎలా పరిష్కరిస్తుంది. అయితే కర్ణాటక పార్ముల సైతం అధిష్ఠానం ప్లాన్ బి గా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది!.రేవంత్ ను ముఖ్య మంత్రి చేసేందుకు సీనియర్ లు అడ్డుపడితే లోక్ సభ ఎన్నికల వరకు ప్లాన్ బి అమలు చేసి మల్లు బట్టి విక్రమార్కను సీఎం ను చేసి రేవంత్ రెడ్డీనికి ఉప ముఖ్య మంత్రి పదవి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ని ఒప్పించే విధంగా అధిష్ఠానం ఆలోచన చేసే అవకాశం కూడా లేకపోలేదు.ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ లో కెసిఆర్ ఇచ్చిన దళిత ముఖ్య మంత్రి హామీని కాంగ్రెస్ తిర్చినట్లు ఉంటుంది. రాబోయే లో్సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందే అవకశం ఉంటుందని పలువురు రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలుస్తోంది.లేకపోతే అన్నీ సవ్యంగా ఉంటే రేవంత్ రెడ్డికే ముఖ్య మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం సైతం ఉంది.తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డినే సీఎం కావాలని కోరుకుంటున్నారు అనే అంశాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గుర్తించింది.ప్రజల కోరికకు వ్యతిరేకంగా పార్టీ నిర్ణయం తీసుకోకపోవచ్చు అనే వాదన కూడా ఉంది.మెజారిటీ ఎమ్మెల్యే లు సైతం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.









