గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన చరణ్ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ మైసూర్‌లో జరుగుతున్న ‘గేమ్ ఛేంజర్’లో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు









