108 అంబులిన్సులను తనిఖీ చేసిన హైదరాబాద్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్.

108 అంబులిన్సులను తనిఖీ చేసిన హైదరాబాద్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్.

♦ అంబులెన్స్ లో పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొని రోగుల అవసరాలకు ఉపయోగించాలని సూచించిన ఆడిటర్ వెంకటేశ్వర్లు.

♦ ఫోన్ మోగిన 30 సెకండ్లకే 108 అంబులెన్స్ కదలాలి, రోగులతో స్నేహభావంతో వ్యవహరించాలి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 28:టుడే 9 ప్రతినిధి

మంగళవారం నాడు పట్టణంలోని 108 అంబులెన్స్ లను జీవీకే కంపెనీ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు భద్రాచలం పరిసర ప్రాంత అంబులెన్సులు వాటిలోని పరికరాల స్థితిగతులను, వాటి పనితనం గురించి అడిగి తెలుసుకున్నారు, ఈ తనిఖీలలో భాగంగా ఆడిటర్ వెంకటేశ్వర్లు భద్రాచలం, బూర్గంపహాడ్, అశ్వాపురం,మణుగూరు,జానంపేట,దుమ్మగూడెం,చర్ల 108 వాహనాలను,102 అమ్మ ఒడి వాహనాల స్థితిగతులను వాటిలో ఉండే పరికరాల పరిస్థితులను, అందులో పనిచేసే ఉద్యోగుల విధి విధానాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు, అంబులెన్స్ సిబ్బంది  ఎప్పటికప్పుడు అప్రమత్తంగాఉండాలని సూచించారు, 108 అంబులెన్స్ సేవలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఏదైనా సమస్యలు వస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని,ఈ సందర్భంగా తెలియజేశారు… ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆడిటర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈఎంఈ మనోహరా చారి, 108, 102 అంబులెన్సుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Facebook
WhatsApp
Twitter
Telegram