అంధుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు బ్రెయిలీ…

బ్రెయిలీ 217 జయంతి సందర్భంగా శ్లాఘించిన పలువురు

అంధత్వాన్ని ఆయుధంగా మలచి అంధుల జీవితాలలో వెలుగులు నింపిన సాధకుడు,లూయీ బ్రెయిలీ జయంతి ని,MSP పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా విహెచ్పిఎస్ బ్లైండ్ డిజిబులిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మిట్టపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు…

స్థానిక సుభాష్ నగర్ కాలనీ నందు మహాజన సోషలిస్టు పార్టీ ఎం ఎస్ పి , మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీహెచ్పీఎస్ బ్లైండ్ డిజిబిలిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మిట్టపల్లి నరేంద్ర, హెచ్ఆర్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ,వికలాంగుల నాయకులు కిష్ట శ్రీనివాస్ రావు, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, ఎం ఎస్ పి జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్ లు మాట్లాడుతూ….
సమాజం చేత వంచనకు, అవమానాలకు, చీత్కారాలకు గురై అంధత్వాన్ని దూషించుకుంటూ ,తమ బ్రతుకింతేననే నిరాశా నిస్పృహల్లో జీవించేవారు కృంగిపోకుండా, వారిలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపి అందత్వం చూసే మనిషికే కానీ తనకు లేదని, తాము ఎందులో తక్కువ కాదని, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చేసి నిరూపించిన గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేయడం సంతోషకరమని అన్నారు. అంధుడై ఉండి కూడా తాను చదువుకొని, ఆ అందులకోసం లిపిని కనుకొని, తను చదువుకున్న విద్యాలయానికే ప్రొఫెసర్ గా నియమితులవ్వడం, ప్రపంచ దేశాలకే ఆయన స్ఫూర్తిగా నిలవడం గొప్ప విషయం అని గుర్తు చేశారు. అదే విధంగా లూయిస్ బ్రయిలీ ని స్పూర్తిగా తీసుకొని సామాజిక, ఆర్థిక, రాజకీయ ఫలాలు అందక చీకట్లో బతుకుతున్న అణగారిన, పీడిత వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మహాజన నేత పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సామాజిక న్యాయమే ఏజెండాగా భారత రాజ్యాంగ ప్రవేశిక అమలునే మేనిఫెస్టోగా మహాజన సోషలిస్టు పార్టీ ని ఏర్పాటు చేయడం జరిగిందని, మహాజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ,అగ్రకుల ప్రజలను ఏకం చేసి ప్రతి గ్రామంలో మహాజన సోషలిస్టు పార్టీని నిర్మాణం చేసి, సమాజ అభ్యున్నతి కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు బొడ్డు సత్యనారాయణ, మేకల వెంకట్, గడ్డల ప్రవీణ్, హెచ్చు వంశీ, మోహిత్, ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క, బొడ్డు రమాదేవి, కొప్పుల నాగమణి, అలవాల రేవతి తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram