నటి భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాల సరస్సులో పూసిన తెల్లకలువలాంటి అందంతో, చాళుక్యుల కాలం నాటి శిల్పం లాంటి లావణ్యంతో ఆమె యూత్ మనసులను ఆకర్షిస్తోంది. వెండితెరపై ఆమెకు పెద్దగా సక్సెస్ లు లేకపోయినప్పటికీ, కేవలం ఆమె గ్లామర్ మరియు క్రేజ్ కారణంగా పరిశ్రమలో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండటం విశేషం.
వచ్చే నెల చివరి వారంలో ఈ గ్లామరస్ బ్యూటీ ‘లెనిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్కినేని అఖిల్ సరసన కథానాయికగా భాగ్యశ్రీ నటించిన ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే టాక్ సినిమా సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ తన కెరీర్‌కు ఎంతో కీలకం కానుండటంతో భాగ్యశ్రీ కూడా దీనిపైనే కొండంత ఆశలు పెట్టుకుంది.
మరోవైపు, తాజాగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో కూడా భాగ్యశ్రీ ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు అభిమానుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో జాన్వీకపూర్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్‌లో శృతిహాసన్ నర్తించనుంది. బిజినెస్ మరియు మార్కెటింగ్ పరంగా మేకర్స్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినప్పటికీ, గ్లామర్ పరంగా చూస్తే భాగ్యశ్రీకి కూడా ఇందులో ఎక్కడో ఒక చిన్న ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రామ్ చరణ్ తదుపరి చిత్రంలోనైనా ఈ సుందరికి అవకాశం దక్కుతుందేమోనని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









