BRS పార్టీ ఆధ్వర్యంలో చలో మణుగూరు రేగా కాంతారావు…

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

గురువారం రోజున మణుగూరులో ఉప ముఖ్యమంత్రితో సహా నలుగురు మంత్రులు సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా రైతాంగం పక్షాన నిలబడదాం. రైతుల సమస్యలపై ప్రశ్నిద్దాం. సమాధానాలు రాబడుదాం. అందుకే యావత్ భద్రాద్రి జిల్లా BRS నాయకులు, కార్యకర్తలు మణుగూరు కదులుదాం. BRS పార్టీ జిల్లా ప్రజల పక్షాన అడిగే ఈ కింది ప్రశ్నలకు నలుగురు మంత్రులు సమాధానాలు చెప్పాలి.

1. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు భద్రాద్రి జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటి.? స్పష్టంగా చెప్పాలి.?
2. సీతారామ ప్రాజెక్టును ఏ ఉద్ధరించారని ఈ నలుగురు మంత్రుల పర్యటన.?
3. భద్రాద్రి జిల్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా.?
4. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారో నలుగురు మంత్రులు స్పష్టంగా చెప్పాలి.?
5. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 31 నెలలలో సీతారామ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయనిది నిజం కాదా.?
6. ఖమ్మం జిల్లా రైతాంగానికి మూడవ పంటకు సాగునీరు అందించడం మాకు సంతోషమే.. కానీ.. మా భద్రాద్రి జిల్లా రైతాంగం సంగతి ఏమిటి.?
7. భద్రాద్రి జిల్లాలో మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి చనిపోయిన 100 మంది రైతులకు రైతుబీమా అందిస్తారా.? లేదా.? అసలు ఆ రైతులకు LIC ప్రీమియం కట్టినారా.. లేదా.?
8. కరువు పరిస్థితుల దృష్ట్యా మీ ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే వ్యవసాయ ప్రణాళికను ప్రకటించండి.
9. టెక్నాలజీని వాడుకోవడం అంటే స్విగ్గి, జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెడితే గంటలోపు ఇంటివద్దకే వచ్చినట్టు.. యూరియా ఆర్డర్ పెట్టిన గంటలోపు రైతు పొలం వద్దకు చేరాలి.. కానీ.. గోదాములో లేనిది యాప్ లో ఆర్డర్ పెడితే ఎక్కడ నుంచి వస్తాయి.? దీనికి నలుగురు మంత్రులు స్పష్టమైన సమాధానం చెప్పాలి.?
10. పోడు భూములకు కొత్త పట్టాలు ఇస్తానన్న ఎన్నికల మాటలు ఏమాయే.?
11. ప్రభుత్వ భూములు సాగు చేసే ఆదివాసులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి.. పూర్తి హక్కులు కల్పిస్తారా..ఇవ్వరా.?
12. మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎప్పటిలోగా నీళ్లను రైతాంగానికి అందిస్తారు.?
13. మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఎప్పటిలోగా ఇస్తారు.?
14. జిల్లాలో మూలనపడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను పునరుద్ధరిస్తారా.. లేదా.?
15. భవిష్యత్తులో సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించడానికి మీ వద్ద ప్రణాళిక ఉన్నది.? స్పష్టంగా చెప్పాలి.?
16. రెండు పంటలకే ఇవ్వలేని సాగునీరు మూడో పంటకు ఎక్కడిది.?
17. 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతుల వివరాలు మీ వద్ద ఉన్నాయా.. ఉంటే తక్షణమే ప్రకటించండి.?
18. రైతు భరోసా అందని రైతుల వివరాలు మీ వద్ద ఉన్నాయా.. ఉంటే తక్షణమే ప్రకటించండి.?
19. ఎన్నికలలో ప్రకటించిన విధంగా రైతు కూలీలకు 12000 ఎప్పటినుండి ఇస్తారు.? అసలు ఇస్తారా.. ఇవ్వరా.. స్పష్టంగా చెప్పాలి.?
20. రైతు డిస్కం పేరుతో భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతున్నదా.. లేదా.?
21. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందడం లేదన్న విషయం మీ దృష్టిలో ఉన్నదా.. ఉన్నట్లయితే ఏం చర్యలు తీసుకుంటున్నారు స్పష్టంగా చెప్పాలి.?
22. అలాగే పామాయిల్ కొనుగోలు కేంద్రాన్ని ఏడూళ్ళ బయ్యారం కేంద్రంగా ప్రారంభించాలి.?
23. ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందిస్తారా.. అందించరా.? మొన్న గుండాల, నిన్న పినపాక, నేడు రామవరం.?
24. ఆరోగ్యశాఖను గాడిలో పెట్టే ప్రణాళిక మీ వద్ద ఏమైనా ఉన్నదా.. ఉంటే ప్రకటించండి.?
25. ఇసుక లారీల ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ఉందా.. లేదా.?
BRS పార్టీ ప్రజల పక్షాన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున పోరాటాలు ఉదృతం చేస్తాం, ప్రజాక్షేత్రంలో మిమ్మలను మీ పార్టీని దోషులుగా నిలబెట్టే వరకు.. వాటిని నిగ్గు తేల్చే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు