మంగళగిరి.. కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్‌ 

మంగళగిరి.. కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్‌

విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు.

పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులకి చెరుకు గెడల్ని ఆహారంగా అందించారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు.

 

ఈ రెండు కుంకీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు