చేనేత సంక్షేమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది: సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ హయాంలో చేనేత కార్మికులకు ఆర్థిక ధీమానందించిన ‘నేతన్న బీమా’, ‘నేతన్నకు చేయూత’ వంటి ప్రతిష్టాత్మక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి నేతన్నలను తీవ్ర కష్టాల్లోకి నెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. గతంలో అందించిన బతుకమ్మ చీరలు, పాఠశాల యూనిఫారాల తయారీ ఆర్డర్లను పక్కనబెట్టి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రూ. 18,000 ఆర్థిక సాయం, రూ. 1 లక్ష వ్యక్తిగత రుణమాఫీ, మరియు 5 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ వంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బోర్డులను రద్దు చేసి జీఎస్టీ విధించి దెబ్బతీస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో ఉన్న పథకాలను నిలిపివేసి నేతన్నలను మోసం చేసిందని మండిపడ్డారు.

జాతీయ చేనేత దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కాకూడదని, చేనేత కుటుంబాలకు నిజమైన భరోసా కల్పించాలని కేటీఆర్ హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపు వైఖరిని వీడి, రద్దు చేసిన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని మరియు ఎన్నికల హామీలను నెరవేర్చి చేనేత రంగానికి అండగా నిలవాలని లేఖలో తీవ్రంగా డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు