Gaja Teaser: ప్రేమ.. రక్తపాతం.. అంతుచిక్కని రహస్యం.. ‘గజ’ టీజర్‌ అదిరిపోయింది

ప్రేమించిన అమ్మాయినే హీరో ఎందుకు చంపాలని ప్రయత్నించాడు? అతడి నిర్ణయం వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏమిటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో సతీష్ జై తెరకెక్కించిన ‘గజ’ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

చలమలశెట్టి సునీల్ సమర్పణలో, సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై డాక్టర్ మైత్రి శరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమకథకు థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ రూపొందించిన ఈ సినిమా కథలో అనేక మలుపులు ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా హీరో తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిపై హత్యాయత్నానికి పాల్పడటం కథపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత సతీష్ జై. నటుడిగా కెమెరా ముందే కనిపించడంతో పాటు దర్శకుడిగా కెమెరా వెనుక ఉండి సినిమాను తెరకెక్కించారు. పద్మనాభ రెడ్డి, జి. మధుసూదన్, ఎం. నరేంద్ర సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టీజర్‌లోని యాక్షన్, ఎమోషన్, రొమాంటిక్ సన్నివేశాలు ‘గజ’పై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు