Independence Day: 2026లో 79వదా.. 80వ స్వాతంత్ర్య దినోత్సవమా? ఇదే అసలు లెక్క

భారతదేశం 2026 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోనుంది. అయితే ఈసారి 79వ స్వాతంత్ర్య దినోత్సవమా? లేక 80వదా? అనే సందేహం చాలామందిలో నెలకొంది. దీనికి కారణం “పూర్తయిన స్వాతంత్ర్య సంవత్సరాలు” ఒక విధంగా, “జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవాల సంఖ్య” మరో విధంగా లెక్కించడమే. భారత్ 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది.

1947 నుంచి 2026 వరకు లెక్కిస్తే.. 2026 ఆగస్టు 15 నాటికి భారత్‌కు 79 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తవుతుంది. అంటే దేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ కోణంలో చూస్తే 79 సంవత్సరాలు పూర్తి కావడం సరైన లెక్క.

అయితే స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎన్నోసారి జరుపుకున్నామనే లెక్కన చూస్తే 2026లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15న జరిగిన తొలి వేడుకను మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణిస్తే, 2026 నాటికి అది 80వ వేడుక అవుతుంది. అందుకే 2026 ఆగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవం, 79 సంవత్సరాల స్వాతంత్ర్య పూర్తి అని చెప్పడం సరైనది.

సింపుల్‌గా చెప్పాలంటే.. “భారత్‌కు 79 ఏళ్ల స్వాతంత్ర్యం పూర్తయింది.. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది” అనేది ఈ లెక్కకు సరైన వివరణ. సోషల్ మీడియాలో కనిపిస్తున్న 79, 80 అనే రెండు సంఖ్యల మధ్య ఉన్న గందరగోళానికి ఇదే కారణం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు