ట్రంప్ కీలక ప్రకటన.. పదవి నుంచి వైదొలగనున్న కరోలిన్ లీవిట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ఆగస్టు నెలాఖరులో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.

కేవలం 28 ఏళ్ల వయసులోనే కరోలిన్‌ లీవిట్‌ వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి గత ఏడాదిన్నరగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ బాధ్యతలు నిర్వహించడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని ఆమె పేర్కొన్నారు. ట్రంప్‌ పాలనలో కీలకమైన మీడియా ప్రతినిధిగా ఆమె వ్యవహరించారు.

ఇటీవలే కరోలిన్‌ లీవిట్‌ మాతృత్వ సెలవు ముగించుకుని తిరిగి విధుల్లో చేరారు. మే నెలలో ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చారు. కుటుంబానికి మరింత సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు