కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు అశ్వాపురం బీఆర్ఎస్ నాయకుల పయనం..

Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బహుళార్థక కాలేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అశ్వాపురం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలేశ్వరం బయలుదేరారు.

ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నిర్మాణం–నీటి వినియోగానికి సంబంధించిన వాస్తవాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
“ఆరోపణలు విన్నంత మాత్రాన కాదు..

వాస్తవాలను కళ్లారా చూసి ప్రజలకు చెప్పాలి” అని నాయకులు పేర్కొన్నారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు నిజానిజాలు ప్రజలకు తెలియాలి.. రాజకీయ ఆరోపణలకు అతీతంగా వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రావాలి” అని అన్నారు.
“ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సాగునీటి రంగంలో వచ్చిన మార్పులు, ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం” అని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శన అనంతరం అక్కడి పరిస్థితులపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని నాయకులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు