Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు
త్వరితగతిన రైతులకు నీళ్ళుఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యం MLA పాయం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్ళపాడు పనుల పురోగతిని పరిశీలించేందుకు పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించారు. వీలైనంత త్వరగా తుమ్మలచెరువు కు గోదావరి నీళ్లు తరలించేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాత్రి పగలు రెండు షిఫ్టుల్లో పనులు నిర్వహించేందుకు గతంలోనే అధికారులను ఆదేశించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పనులు ఆపవద్దని, నాలుగైదు రోజుల్లో పనులు పూర్తిచేయాలని ఆలస్యాన్ని ఉపేక్షించేది లేదని అవసరమైతే పనులు పూర్తయ్యేవరకు పగలూ రాత్రి ఇక్కడే ఉంటానని తెలిపారు.
ఇది ఇలా ఉంటే ఈ నెలాఖరులోగా మారెళ్ళపాడు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేసి తీరతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సీనియర్ నాయకులు వూసా అనిల్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.









