సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియాలోకి మళ్లీ ఛాన్స్.. బీసీసీఐ కీలక సమాచారం

భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలపై మరోసారి చర్చ మొదలైంది. కొలంబోలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యను కలిసిన సూర్య.. ఆయన ఫిట్‌నెస్‌ను చూసి సరదాగా ‘ఫిట్‌గా అవుతున్నారు.. మళ్లీ కమ్‌బ్యాక్‌కు ప్రయత్నిస్తున్నారా?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి జయసూర్య చిరునవ్వుతో స్పందించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఈ సరదా సంభాషణకు మించి సూర్యకుమార్ రీఎంట్రీపై బీసీసీఐ వర్గాల నుంచి కీలక సమాచారం వెలువడినట్లు తెలుస్తోంది. టీమిండియా తలుపులు సూర్యకు పూర్తిగా మూసుకుపోలేదని, దేశవాళీ క్రికెట్‌లో వరుసగా పరుగులు సాధిస్తే అతడిని మళ్లీ జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సూర్య అభిమానుల్లో ఆశలు చిగురించాయి.

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించి టైటిల్ అందించాడు. అయితే ఆ తర్వాత అతడి బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. అనంతరం ఆటగాడిగా కూడా జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటితే మరోసారి టీమిండియా జెర్సీ ధరించే అవకాశం ఉందనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు