Iran-US Ceasefire: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు సూత్రప్రాయ అంగీకారం?

అమెరికా, ఇరాన్ మధ్య తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యన్ వార్తా సంస్థ RIA నోవోస్టి కథనం ప్రకారం.. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. పాకిస్తాన్ సైనిక అధికారులు, ఇరాన్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనం వెలువడింది.

ప్రతిపాదిత సీజ్‌ఫైర్ ఒప్పందంలో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల స్వేచ్ఛా రవాణాకు అనుమతించడం కీలక అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు, ఇంధన సరఫరాకు అత్యంత ముఖ్యమైన ఈ సముద్ర మార్గంలో రాకపోకలు పునఃప్రారంభమైతే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. త్వరలోనే ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ వార్తలపై అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సీజ్‌ఫైర్ ఒప్పందం నిజంగా అమల్లోకి వస్తే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు