టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు పవన్ సాదినేనిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఓ లేడీ ఆర్టిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని, చాలాకాలం తనతో సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది.
తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి అనంతరం మోసం చేశారని సదరు ఆర్టిస్ట్ ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోపణలపై విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన ఆధారాలు, ఆరోపణల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
పవన్ సాదినేని టాలీవుడ్‌లో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా నమోదైన కేసు నేపథ్యంలో ఆయన పేరు వార్తల్లో నిలిచింది.









