పాకిస్థాన్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది పసికందులు మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది.

ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో నర్సరీలో మంటలు, దట్టమైన పొగ వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో నర్సరీలో మొత్తం 16 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి ఒక్క శిశువును మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన 15 మంది శిశువులు మంటలు, పొగలో చిక్కుకుని మృతి చెందినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే నర్సరీలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ఏసీ కంప్రెసర్ పేలుడు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు