బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, యువ హీరో ఇషాన్ ఖట్టర్ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇద్దరూ కలిసి నటించిన ‘ధడక్’ సినిమా సమయంలో ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా ఈ వార్తలకు మరింత ప్రచారం వచ్చింది. దీంతో జాన్వీ, ఇషాన్ నిజంగానే పెళ్లి చేసుకున్నారంటూ నెటిజన్లు భావించారు.
అయితే వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలపై తాజాగా స్పష్టత వచ్చింది. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నిజంగా పెళ్లి చేసుకోలేదని, అవి ‘KALKI Bride & Groom Couture ’26’ బ్రాండ్ ప్రమోషనల్ షూట్‌లో భాగంగా తీసిన ఫొటోలు, వీడియోలని సంబంధిత బ్రాండ్ నిర్వాహకులు వెల్లడించారు. కొత్త వెడ్డింగ్ కలెక్షన్‌ను ప్రమోట్ చేసే క్రమంలో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో కనిపించారు.
ఈ ప్రమోషనల్ షూట్ ఫొటోలు, వీడియోలను కొందరు నిజమైన వివాహ వేడుకకు సంబంధించినవిగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే బ్రాండ్ నిర్వాహకులు ఇచ్చిన క్లారిటీతో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని స్పష్టమైంది.









