దక్షిణాది నుంచి ప్రధాని అభ్యర్థిగా విజయ్…?
తమిళ్ నాడులో మొన్నామధ్య జరిగిన ఎన్నికలలో సర్వే లను తోసిరాజని ప్రముఖ తమిళ హీరో విజయ్ అనూహ్యంగా సీఎం పీఠం అధిరోహించిన విషయం తెలిసిందే.. కాగా ఆయన సీఎం అయిన అనంతరం తీసుకున్న సంచలన నిర్ణయాలతో తమిళ ప్రజల మనసులను గెలిచారు.
ఇప్పుడు తాజాగా,ఇండియా టుడే – సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాన మంత్రి అభ్యర్థులుగా మోదీ , రాహుల్ గాంధీ తర్వాత టీవీకే అధినేత విజయ్ మూడో స్థానంలో నిలిచారు.తమిళనాడులో సంపాదించిన ప్రాంతీయ మద్దతుతో పాటు, పాన్-ఇండియా సినిమాల ద్వారా ఉత్తరాది యూత్ ,జెన్ జీ ఓటర్లలో విజయ్కి ఉన్న క్రేజ్ ప్లస్ పాయింట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు…
ప్రతిపక్ష కూటమి నాయకత్వ రేసులో 12.2% తో రాహుల్ తర్వాత 2వ స్థానంలో విజయ్ నిలిచారు. ఢిల్లీ పీఠంపై సౌత్ నేత కూర్చోవాలనే లక్ష్యంతో TVK ప్లాన్ వర్కవుట్ అవుతోందా?… ఆ కల విజయ్ ద్వారా నెరవేరబోతొందా? అనేది వేచి చూడాలి…
కమలానికి అలారం బెల్స్..
ఇదిగా ఉంచితే ఇండియా టుడే – సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బీజేపీ స్థానాలు 261కి తగ్గినట్లుగా తేల్చారు.నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ద్రవ్యోల్బణంతో హిందీ హార్ట్లాండ్లోని యువతరం ఎన్డీయేపై అసంతృప్తి తదితర అంశాలు బిజెపికి సంకట పరిస్థితులను తెచ్చి పెట్టేట్టుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఉత్తరప్రదేశ్లో విపక్ష ఇండియా కూటమి ఆధిక్యం సాధిస్తుందనే అంచనాలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారబోతొందనే చర్చలు లేకపోలేదు.
అయితే మోదీ, షాని ఎవరూ తక్కువ అంచనా వేయలేరని . . విపరీతమైన ప్రజాదరణ, అనూహ్య వ్యూహాలతో ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో వారి మార్క్ వేరు అని మరికొందరు భావిస్తున్నారు.. కాగా ఈ సర్వే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపింది.









