రూ.150 కోట్ల క్లబ్‌లో ‘ఇరుముడి’.. రూ.200 కోట్ల దిశగా రవితేజ మూవీ దూకుడు

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. భావోద్వేగాలు, సామాజిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ భారీ వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌పై ఆసక్తి నెలకొంది.

ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు విశేష స్పందన లభిస్తుండటంతో కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను రాబడుతూ పలు మైలురాళ్లను అధిగమిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే మరో రెండు, మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లాంగ్ రన్‌లో ‘ఇరుముడి’ ముందు రూ.300 కోట్ల భారీ టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వసూళ్ల జోరు మరికొన్ని రోజులు కొనసాగితే ఈ మార్క్‌ను కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ రీజినల్ సినిమాల్లో సరికొత్త రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశం కూడా ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ‘ఇరుముడి’ ఫైనల్ రన్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు