‘గాంధారి’ vs ‘టాక్సిక్’.. మహిళా పాత్రలపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!

తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గాంధారి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కనికా కపూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత తాప్సీ పాత్రకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హీరో చుట్టూ తిరిగే గ్లామర్ పాత్రకు భిన్నంగా, తనకంటూ ఒక లక్ష్యం ఉన్న మహిళగా తాప్సీని చూపించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘గాంధారి’ ట్రైలర్‌లో తాప్సీ కూతురు కోసం పోరాడే తల్లిగా కనిపిస్తోంది. చూపు లేకపోయినా తన బిడ్డను కాపాడేందుకు ఆమె చేసే పోరాటం సినిమాకు ప్రధాన హైలైట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు నెటిజన్లు ఈ సినిమాను యష్ నటించిన ‘టాక్సిక్’తో పోలుస్తున్నారు. ముఖ్యంగా రెండు చిత్రాల్లో మహిళా పాత్రలను చూపించిన విధానంలో తేడా ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

‘టాక్సిక్’లో హీరోయిన్ల పాత్రలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. హీరోతో సాగే సన్నిహిత సన్నివేశాల చుట్టూనే మహిళా పాత్రలు ఎక్కువగా కనిపించాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘గాంధారి’లో తాప్సీకి ఇచ్చిన ప్రాధాన్యతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలపై కొనసాగుతున్న ఈ సోషల్ మీడియా డిబేట్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు