చిరంజీవి స్పెషల్ విషెస్.. పవన్‌పై ప్రేమతో నిండిన అన్న మాటలు!

మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ పవన్‌పై తనకున్న ప్రేమ, గర్వాన్ని వ్యక్తం చేశారు.

చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను తాను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని తన తమ్ముడిని కొనియాడారు. కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యాన్ని పవన్ చూపిస్తారని చిరంజీవి తెలిపారు.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం పవన్ కళ్యాణ్ అంకితభావంతో పనిచేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా అన్నగా చిరంజీవి చేసిన ఈ ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు సైతం చిరంజీవి, పవన్ మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు