కమల్ హాసన్‌తో యంగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్.. క్రేజీ పోలీస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్!

సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ, నవతరం దర్శకులతో వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్న ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పన్నైయారుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, ‘సిద్ధా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), నిర్మాత ఆర్. మహేంద్రన్, టర్మెరిక్ మీడియా సంయుక్తంగా నిర్మించనున్నాయి.

అరుణ్ కుమార్ సినిమాలు సాధారణంగా బలమైన పాత్రలు, ఎమోషన్, గ్రౌండెడ్ కథనంతో తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు కమల్ హాసన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ పవర్‌ఫుల్ పోలీస్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. కమల్ హాసన్ స్వయంగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘విక్రమ్’ తర్వాత RKFI వరుసగా క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

కమల్ హాసన్ వంటి విశ్వనటుడు, అరుణ్ కుమార్ వంటి సెన్సిబుల్ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు