మాయావతి సంచలన నిర్ణయం.. మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు కీలక పదవి నుంచి ఉద్వాసన!

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రారంభించగా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు.

తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్‌కు ప్రస్తుతం మరింత రాజకీయ పరిణతి, అనుభవం అవసరమని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతానికి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.

అయితే ఆకాశ్ ఆనంద్ బీఎస్పీలోనే కొనసాగుతారని మాయావతి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి కీలక సంస్థాగత బాధ్యతలు ఇవ్వబోమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయావతి తీసుకున్న ఈ నిర్ణయం బీఎస్పీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు