డ్రగ్స్, గంజాయిపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం…1.9 కోట్ల గంజాయి పట్టివేత”

డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, పోలీసులు 4–5 రోజుల వ్యవధిలో మూడు ప్రధాన ఆపరేషన్లతో పాటు అక్రమ గంజాయి సాగుపై దాడులు నిర్వహించారు.

బెంగళూరు నుంచి రైలులో 110 గ్రాముల ఎండీఎంఏ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని యర్రంసెట్టి నాగ సౌమ్యను విజయవాడలో అరెస్ట్ చేశారు. రూ.11 లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు ఆమెకు హ్యాండ్లర్‌గా ఉన్న షేక్ బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

కర్నూలులో అమకతాడు వద్ద హ్యుందాయ్ వెర్నా కారులో తరలిస్తున్న 20 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 లక్షల విలువైన డ్రగ్స్‌తో నల్లూరి వరుణ్ తేజ అరెస్టయ్యాడు. విశాఖపట్నం తుర్లువాడ టోల్‌ప్లాజా వద్ద 385 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.1.9 కోట్లు అని అంచనా

 

ఇది ఇలా ఉండగా, నెల్లూరు జిల్లా దత్తలూరులో రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న అక్రమ గంజాయి పంటను ధ్వంసం చేశారు. 11 క్రిమినల్ కేసులున్న ఉప్పలపాటి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ఏపీ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు