జాతీయ అవార్డు గ్రహీత, నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి దసరా పండుగను కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొల్లూరు మూకాంబికా దేవి ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి ప్రగతి శెట్టి, పిల్లలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న రిషబ్ శెట్టి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల నుంచి ఆశీస్సులు అందుకున్నారు.
మరోవైపు రిషబ్ శెట్టి సినీ కెరీర్ శరవేగంగా దూసుకుపోతోంది. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరంతో కలిసి ఆయన రెండు ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్నారు. వీరిద్దరి కలయికలో రానున్న తొలి చిత్రంగా కన్నడలో ఒక స్పోర్ట్స్ డ్రామాను రూపొందించనున్నారు. ప్రముఖ నిర్మాత షిబు థమీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్‌లతో పాటు రిషబ్ శెట్టి ఇప్పటికే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘కాంతార: చాప్టర్ 1’తో పాటు ‘జై హనుమాన్’ వంటి భారీ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే ‘కాంతార: చాప్టర్ 1’ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్ట్ పంచుకున్న ఆయన, ఒకవైపు భక్తితో ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూనే.. మరోవైపు వరుస పాన్-ఇండియా సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నారు.
Post Views: 3









