కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  నవంబర్ 9న చింతూరులో ఆదివాసి నిరుద్యోగ భారీ బహిరంగ సభ.

 నవంబర్ 9న చింతూరులో ఆదివాసి నిరుద్యోగ భారీ బహిరంగ సభ.

ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో
నిరుద్యోగ సమన్వయ సమావేశం.

పాల్గొన్న ఆదివాసి జేఏసీ నాయకులు.

చింతూరు అక్టోబర్ 20: టుడే 9 ప్రతినిధి.

షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ని ప్రకటించాలని. పీఎం హామీని బేకారాతి చేస్తూ నియామకాల చట్ట ప్రక్రియను అడ్డుకుంటున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీని తొలగించాలి అని. రేకపల్లిలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించటాన్ని ఆహ్వానిస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టం చేయాలని ఆదివాసి జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జీవో 3 పునరు ర్ధరణలో భాగంగా షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం సాధన కోసం భవిష్యత్తు ఐక్య ఉద్యమ కార్యాచరణ కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రేకపల్లిలో రాష్ట్రస్థాయి ఆదివాసీ సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ జిల్లా ఆదివాసి జేఏసీ నాయకులు రామారావు  మాట్లాడుతూ గత ఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన జీవో 3 పునరుర్ధరణ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక  మెగా డీఎస్సీ తో ఆదివాసిలను దగా చేయడం జరిగిందని ఆవేధన వ్యక్తం చేశారు. ఐటీడీఏలలో ఆదివాసిల అభిప్రాయ సేకరణ వర్క షాప్ అంటూ ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టుల్లో అన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగాలతో సహా నాన్ డ్రైవర్స్ కి దోచి పెట్టారని, మళ్ళీ మరో డీఎస్సీ అంటున్నారని. ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టం చేసి ప్రత్యేక కల్పించాలని డిమాండ్ చేశారు. ట్రైబల్ సెక్రెటరీ సైతం తొలగించాలని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని ఆదివాసి సంఘాలు నవంబర్ 9న జరిగే బహిరంగ సభకు మద్దతు తెలపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మడివి నెహ్రూ జల్లి నరేష్ .కాకా సీతారామయ్య. సేసం సురేష్. పూణేం ప్రదీప్.ఎం లక్ష్మి. రాంప్రసాద్ చిక్కాల బాలు వేట మల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు