కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  వివాహేతర బంధానికి ఇద్దరు బలి! దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌నగర్‌లో చోటు చేసుకున్న  సంచలన ఘటన 

.వివాహేతర బంధానికి ఇద్దరు బలి!

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌నగర్‌లో చోటు చేసుకున్న  సంచలన ఘటన 

 రోజు రోజుకి మానవతా విలువలు మంట కలిసి పోతున్నాయి. అక్రమ సంబంధాల మోజులో పడిన కొందరు తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. భర్తను పిల్లలను కాదని పైపై మెరుగులకు ఆశపడ్డ యువతి తన ప్రాణాలను కోల్పోయింది ఈ విషాద సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆకాశ్ (23), శాలిని (22) అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా..భర్త ఆకాశ్ ఈ-రిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు

అయితే, శైలేంద్ర అనే లోకల్ క్రిమినల్‌తో శాలినికి వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ వ్యవహారం కొన్నేళ్ల నుంచి సాగుతుండగా.. ఈమధ్య శైలేంద్రని శాలిని దూరం పెట్టింది. ఇది జీర్ణించుకోలేని శైలేంద్ర.. శాలినిని ఎలాగైనా చంపాలని పథకం వేశాడు. తల్లిని కలిసి తిరిగి ఆటోలో వెళ్తుండగా.. వారిని శైలేంద్ర రోడ్డుపై అడ్డగించాడు. ఈ-రిక్షాలో కూర్చున్న శాలిని వద్దకు నేరుగా వెళ్లిన ప్రియుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

తన భార్యని కాపాడబోయిన ఆకాశ్‌పై సైతం.. శైలేంద్ర కత్తితో దాడి చేశాడు.చివరికి ఆకాశ్, శైలేంద్ర నుంచి కత్తి లాక్కొని.. అతనిని పలుమార్లు పొడిచాడు.ఈ దాడిలో శాలిని, శైలేంద్ర మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ఆకాశ్ ఆసుపత్రిపాలయ్యాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు