శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తోంది…

టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తోంది….

వైస్సార్సీపీ యూత్ కార్యకర్తల సమావేశంలో నాయకులు కె. రాజ్ కుమార్.

చింతూరు అక్టోబర్ 21: టుడే9 ప్రతినిధి

వైఎస్సార్ సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయటంలో భాగంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు తాను ప్రజల వెంటే  ఉంటానని హామీ ఇస్తున్నామన్నారు ఆ పార్టీ యువనేత . .ఆల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం లొ ఎమ్మెల్సీ అనంతబాబు ఆదేశాల మేరకు కూనవరం వైస్సార్సీపీ యూత్ లీడర్ కరక రాజ్ కుమార్ ఆధ్వర్యంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో యువనేత రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ మోసపూరిత ప్రభుత్వానికి నాయకులకు గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు చేసింది ఏమీ లేదని పేరుకి మాత్రం సూపర్ సిక్స్ సుపరిపాలన మాటలు తప్ప చేతల్లో లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారంపై  చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని సవాల్ చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కూనవరం మండల యూత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు