శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు సందర్భంగా  మహిళా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ..

చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు సందర్భంగా
 మహిళా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.

ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :టుడే 9 ప్రతినిధి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం  , రామాలయం సమీపము నందు గల    శ్రీ చిన్న జీయర్ స్వామి మఠంలో జరిగిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి  పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ శ్రీ చిన్న జీయర్ స్వామి మఠం, లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, వికాస తరంగిణి వారు భద్రాచలం నియోజకవర్గంలో చేస్తున్న అనేక రకాల సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కొనియాడారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో పనిచేసే 80 మంది మహిళ కార్మికులకు వస్త్రాలను‌ శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో శ్రీనివాసరావు,
జీయర్ మఠం అధ్యక్షులు వెంకటాచార్య, భద్రాద్రి ఆలయ వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు