కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మా కాలనీ సమీపంలో బార్, బెల్ట్ షాప్ లు తొలగించండి….ఐటీడీఏ పిఓకు వైయస్సార్ నగర్ వాసులు వినతి

మా కాలనీ సమీపంలో బార్, బెల్ట్ షాప్ లు తొలగించండి….ఐటీడీఏ పిఓకు వైయస్సార్ నగర్ వాసులు వినతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 27:టుడే 9 ప్రతినిధి

పట్టణంలోని ఐటీడీఏకు ఎదురుగా ఉన్న వైయస్సార్ కాలనీ సమీపంలో బార్. బెల్ట్ షాపులు ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఈ క్రమంలో ఈ ప్రాంతంలో వీటిని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని కోరుతూ భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్ కు వైయస్సార్ నగర్ వాసులు సోమవారం ఐటీడీలో జరిగిన గిరిజన దర్బార్లో వినతి పత్రం అందజేశారు. గుడి, బడి పక్కనే ఉన్నా ఈ ప్రాంతంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పిఓ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన మ్యూజియం ఇటీవల ఆధునికరించడం జరిగిందని ఈ ప్రాంతంలో యాత్రికులు, భక్తులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానికులు నిత్యం సంచరిస్తుంటారని మద్యం దుకాణాలు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బార్,బెల్ట్ షాపులు ఇక్కడి నుంచి ఎత్తివేయాలని పి.ఓకు విన్నవించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పిఓఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దల్లి చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తోటమల్ల బాలయోగి, కార్యదర్శి కటారి కృష్ణారావు, గౌరవ సలహాదారులు జి. రవి, తోకల చిన్న పాపయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు