కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… ఎమ్మెల్యే

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు,ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పోదెం వీరయ్య.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నవంబర్ 23
టుడే 9 ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చీరల పంపిణీ పథకంలో భాగంగా అందిస్తున్న చీరలను ప్రతి ఒక్క మహిళకు చేర్చాలని, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలియజేశారు. ఆదివారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద మహిళలకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమం చేయడం అభినందనియమని అన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులచే తయారు చేయబడిన చీరలను రాష్ట్ర మహిళలకు అందజేయడం శుభపరిణామని వ్యాఖ్యానించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను అందిస్తుందని,వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మన్ పొదెం వీరయ్య లను భద్రాద్రి మహిళా సమాఖ్య ఓబీ సభ్యులు శాలువాతో సన్మానించారు.

ఈ‌ కార్యక్రమంలో ఇందిరా మహిళా క్రాంతి ఏపీఎం, సీసీలు, డ్వాక్రా మహిళలు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు