కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మద్యం దుకాణాలను పెంచుతూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది… హై కోర్ట్

మద్యం దుకాణాలను పెంచుతూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోతుండడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎటువంటి నియమనిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా పెరుగుతున్న మద్యం దుకాణాల సంఖ్య పై జస్టిస్ విజయసేన్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై హైకోర్టును స్థానికులు ఆశ్రయించిన నేపథ్యంలో, ఆ కేసు విచారణ సమయంలో జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు . మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ, విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కనీసం రహదారిపైకి కనిపించకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని, మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి వ్యాఖ్యనించారు. నాగారం మున్సిపాలిటీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్, ఎక్సైజ్ అధికారులకు, షాపు యజమానులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.కనీసం రోడ్ల మీద కాకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అయినా ఇలా ప్రతి వీధిలో మద్యం దుకాణాలను పెట్టుకుంటూ పోతే రాష్ట్రం పేరు మార్చాల్సి వస్తుందని హైకోర్టు న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి అసహనం వ్యక్తంచేశారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు