కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఐటీడీఏ పీవో ని సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు….

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 23
టుడే 9 ప్రతినిధి

గిరిజనుల సంక్షేమం కొరకు ముఖ్యంగా విద్యా, వైద్యం, ఆదివాసి గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కోయ భాషను నేర్చుకోవడమే కాక గిరిజనుల పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలను మెచ్చుకొని ఆదివాసి జేఏసి ఆదివాసి వికాస్ రత్న బిరుదు ఐటిడిఏ పిఓకు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ భద్రాచలం బార్ అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానించడం జరిగిందని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొడాలి శ్రీనివాస్ అన్నారు.
గురువారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో భద్రాచలంలోని బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి పిఓను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గిరిజనుల సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని, ముఖ్యంగా గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని అలాగే జిపిఎస్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం, ప్రైమరీ పాఠశాల విద్యార్థుల కొరకు కెరీర్ గైడెన్స్, క్రీడాకారులకు అధునాతనమైన క్రీడా పరికరాలు అందించడం, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా నేటితరం గిరిజన యువతి యువకులు పాతకాలపు సాంప్రదాయాలు పాటించేలా అవగాహన కల్పించుకోవడానికి గిరిజన మ్యూజియం ఏర్పాటు అలాగే ఎస్ హెచ్ జి మహిళలు, గిరిజన మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల నిత్యవసర సరుకులు, గిరిజన రైతుల ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, జిసిసి ద్వారా అటవీ ఉత్పత్తులు నేరుగా ప్రజలకు అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేత భద్రగిరి మార్ట్ తో పాటు గిరిజన మ్యూజియం ప్రారంభించిన ఘనత ఐటీడీఏ పిఓ కు దక్కినందుకు ఆయనను ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరపున సన్మానించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, కోశాధికారి రాము, సీనియర్ న్యాయవాదులు ప్రసాద్, మంత్రి ప్రగడ గణపతి, పలివెల నరసింహారావు, పడిశిరి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, రవి, నరసింహమూర్తి, సురేష్ కుమార్, నరేష్, రవితేజ, రామ్మోహన్రావు, సంధ్య, అంజలి తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు