శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  మంచినీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి….వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అంకిత్….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 25
టుడే 9 ప్రతినిధి.

ఎండలు ముదిరినందున చాలాచోట్ల భూగర్భ జలాలు ఇంకిపోవడం వలన ఏజెన్సీ మండలాలైన చర్ల దుమ్ముగూడెం లోని మారుమూల ప్రాంత గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులకు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారం నాడు భద్రాద్రి, కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, తాహసిల్దార్ లు, ఎంపీ ఓలు, మున్సిపల్ కమిషనర్ లు, స్పెషల్ ఆఫీసర్లతో వివిధ మండలాలలోని మారుమూల గ్రామాలలోని హెప్టేషన్లలో మంచినీటి సమస్య తలెత్తకుండా తీసుకోవలసిన కార్యాచరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాలలోని ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీఓలు, స్పెషలాఫీసర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ లు సమన్వయంతో ఉండి ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా చూడాలని, మంచినీటి సరఫరాకు సంబంధించిన మిషన్ భగీరథ పైప్ లైన్లు కానీ మోటార్స్ రిపేర్ లో ఉంటే 24 గంటల్లో మరమ్మత్తులు చేయించి 24 గంటల్లో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని, దానికి సంబంధించిన ప్రతి స్టేటస్ తనకు పంపించాలని అన్నారు. అలాగే మంచినీటి సరఫరా చేసే ట్యాంకర్లు, అవసరమైన జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఎంపీడీవోలు మంచినీటికి సంబంధించిన ప్రతి సమాచారము కచ్చితంగా అందించాలని అన్నారు. ఏజెన్సీలోని మారుమూల మండలాలు చర్ల దుమ్ముగూడెం లలో పూసగుప్ప, బోధ వెళ్లి, కూర్నవల్లి, లక్ష్మీపురం, సుబ్బంపేట గ్రామాలలో మంచినీటి సమస్య రాకుండా చూడాలని, అవసరమైతే ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని అన్నారు. ప్రతి ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కార్యాలయంలలో హెల్ప్ లైన్లు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఎండాకాలంలో ఈ మూడు నెలలు గ్రామాలలో ప్రజలకు మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటున్నందున సంబంధిత అధికారులు బోర్లన్నీ రిపేర్లు చేయించి మంచినీరు సరఫరా జరిగేలా చూడాలని అన్నారు.
గ్రామాలలో ఎక్కడైనా మంచినీటి సమస్య తలెత్తితే వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని ఆయన అన్నారు.

ఏజెన్సీ మండలాలైన చర్ల దుమ్ముగూడెం లోని మారుమూల గ్రామాలలో మంచినీటి సమస్య తలెత్తితే సంబంధిత ఈ ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మానిటరింగ్ చేయించి సమస్య పరిష్కరిస్తానని, అలాగే మంచినీటి సరఫరాకు కరెంటు సమస్య, సోలార్ రిపేర్, బోర్వెల్ రిపేర్ ఏమైనా ఉంటే తప్పకుండా మరమ్మత్తులు చేయించి గిరిజనులకు మంచినీటి సమస్య పరిష్కరిస్తానని ఐటీడీఏ పీవో బి రాహుల్ జిల్లా కలెక్టర్కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఓ పవర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు