- ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన భద్రాచలం పోలీస్ లు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 26
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు నెలలుగా పలు దొంగతనం కేసులు కాగా, కేసుల విచారణలో బాగంగా భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనతో పాటు టెక్నికల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిన్నటి రోజున అనగా తేది: 25.04.2026 భద్రాచలంలోని కూనవరం రోడ్ లోని వీరభద్ర ఫంక్షన్ హాల్ ముందు రాత్రి సమయంలో వాహనాల తనిఖి చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ పై పారిపోవుతుండగా వారిని పట్టుకొని విచారించగా వారు ఇద్దరు కూడా భద్రాచలం పట్టణానికి చెందిన వారు కాగా, వారు ఇద్దరు గత కొంత కాలంగా భద్రాచలం పట్టణంలో బూర్గంపాడు మండల పరిదిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లుగా నేరం ఒప్పుకోవడం జరిగింది. వారి ఇద్దరి వద్ద నుండి వెండి వస్తువులతో పాటుగా ఒక మోటార్ సైకిల్ ను స్వాదినపర్చుకున్నాము. ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి, నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచి, జైలుకు పంపడం జరిగింది. దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని, నేరాలకు దూరంగా సత్ప్రవర్తనతో జీవించాలని పోలీస్ వారు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలను పోలీస్ వారు కోరుతున్నారు.
అరెస్ట్ చేయబడిన దొంగల వివరములు:
1) షేక్ దారుక్ బాబా @ చోటు, తండ్రి పేరు: (లేట్) లాలు, వయస్సు: 26 సం:రాలు, కులం: ముస్లిం, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: సీతరామ్ నగర్ కాలని భద్రాచలం, ప్రస్తుత నివాసం: అశ్వారావు పేట, కొత్తగూడెం జిల్లా”
2) ముయ్యేటి పవన్ కళ్యాణ్, తండ్రి: శేషు, వయస్సు: 25 సం. లు. కులం: మాదిగ, వృత్తి: వెల్డింగ్ వర్క్, నివాసం: రాజుపేట కాలని భద్రాచలం, ప్రస్తుత నివాసం ఏటపాక గ్రామం మండలం.









