శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  ప్రజావాణి లోప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి. …తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు….

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 27
టుడే 9 ప్రతినిధి

జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు భద్రాచలం తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినదని తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు అన్నారు.
సోమవారం నాడు తన చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భద్రాచలం రెవెన్యూ పరిధిలోని ప్రజలు వివిధ సమస్యల కొరకు దరఖాస్తులు చేసుకున్నారని, ఇందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీ, ఎలక్ట్రికల్, రెవిన్యూ శాఖ ఇందిరమ్మ ఇండ్లు అర్జీలు (02) దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, వాటిని పరిశీలించి వీలైనంత తొందరగా సమస్యలు పరిస్కారం కొరకు ఆయా శాఖలకు పంపించడం జరిగిందని, రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయడం జరిగిందని, ప్రజలు పెట్టుకున్న అర్జీలు పరిస్కారం దిశగా విచారణ జరిపి దరఖాస్తుదారినికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు.
ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ శాఖలలో ఏవైనా సమస్యలు ఉంటే మధ్య దళారులను ఎవరిని నమ్మకుండా నేరుగా ప్రజావాణి ద్వారా పరిష్కరించుకోవాలని, మండల స్తాయి అధికారులు ప్రజావాణి యందు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్, విద్యుత్ శాఖ మరియు ఐకెపి, వైద్య శాఖ, ఎంపీడీవో కార్యాలయంనకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు