Medigadda Case: మేడిగడ్డ కేసు విచారణ సెప్టెంబర్ 9కు వాయిదా

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించిన కేసు విచారణను జిల్లా కోర్టు సెప్టెంబర్ 9కు వాయిదా వేసింది. ఈ కేసులో అసలు పిటిషనర్ రాయలింగమూర్తి మృతి చెందడంతో విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం.

ఈ వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ మృతి చెందిన నేపథ్యంలో కేసు తదుపరి ప్రక్రియపై కూడా న్యాయస్థానం దృష్టి సారించింది.

ఇదిలా ఉండగా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో కేసీఆర్‌కు మరోసారి సమన్లు పంపించాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9న చేపట్టనున్నట్లు వెల్లడించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు