శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్…

 

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి అధికారులకు ఆదేశాలు.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో. ఏప్రిల్ 29

టుడే 9 ప్రతినిధి

అన్నపరెడ్డి మండలం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత బుధవారం ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా స్వీకరిస్తున్నారా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, సంబంధిత అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ధాన్యంలో తేమ శాతాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తున్న మాయిశ్చరైజింగ్ యంత్రం పనితీరును కలెక్టర్ పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణలో ఎలాంటి లోపాలు లేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా పరీక్షించి వెంటనే కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని సూచించారు.

రైస్ మిల్లులకు ధాన్యం ట్యాగింగ్ విధానం, కొనుగోలు రిజిస్టర్ల నిర్వహణ, టోకెన్ పంపిణీ వ్యవస్థపై సమగ్ర సమాచారం సేకరించారు. టోకెన్లను సమయానికి జారీ చేసి రైతులు అనవసరంగా వేచి ఉండకుండా చూడాలని, ప్రతి రైతుకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కొనుగోలు కేంద్రంలో సరైన రికార్డుల నిర్వహణ ఎంతో కీలకమని, ప్రతి నమోదు ఖచ్చితంగా ఉండాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం రైతులకు మద్దతుగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి రైతు లాభపడేలా చూడటం అధికారుల బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం పెంట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును

తనిఖీలు తాసిల్దార్ స్వర్ణ, ఎంపిడిఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబానా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనూష తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు