Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం ఆనకట్ట వద్ద సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ,జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ప్రాజెక్టును సందర్శించినారు
సీతమ్మ ప్రాజెక్టు బ్యారేజ్ వెంటనే పూర్తి చేయాలని,ఇప్పటి వరకు పూర్తయిన సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ఏర్పాటు చెయ్యాలి. మొత్తం ప్రాజెక్టును పూర్తయ్యేందుకు నిధులు మొత్తం మంజూరు చేయాలి. నిర్వాసితులని ఆదుకోవాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఆగస్టు 15 కల్లా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తానని నీటిపారుల శాఖ మంత్రి మాట తప్పారు. అలాగే ముఖ్యమంత్రి కూడా వాగ్దానం చేసి మరిచారు. మంత్రుల పదవీకాలం మూడు సంవత్సరాలు ముగిసింది ఇంకా రెండేళ్లు ఉంది. ఈ రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టుని పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు నీరు అందించాలని కోరుతున్నాం
ఉభయ జిల్లా ప్రజలపై ముఖ్యమంత్రికి పక్షపాతం ఎందుకు…
కాంగ్రెస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అండగా నిలిచారని, సుదర్శన్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి బలపరిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను సిపిఐ స్థానం కలుపుకొని 9 స్థానాలు ప్రజలు గెలిపించారని, అలాగే మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరడంతో మొత్తం పది స్థానాలను జిల్లా ప్రజలు కాంగ్రెస్కు అందించారని తెలిపారు. రెండు ఎంపీ స్థానాల్లోని కాంగ్రెస్ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలపై పక్షపాతం ఎందుకని ముఖ్యమంత్రిని సుదర్శన్ ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.









