కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  గుంటూరు ఇంటర్ జ్ఞాపకాలు: లెక్చరర్ చేతిలో దెబ్బలు తిన్నానన్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల విద్యార్థులతో ముచ్చటిస్తూ తన ఇంటర్మీడియట్ రోజులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మిత్రుడి కోసం పట్టుబట్టి మరీ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో చేరానని, ఆ సమయంలో తన తండ్రి కేసీఆర్ స్వయంగా కారు నడుపుకుంటూ తనను అక్కడ దింపారని గుర్తు చేసుకున్నారు. లెక్కలంటే భయం ఉన్నప్పటికీ, అక్కడ అనుకున్న గ్రూపులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బైపీసీ (BiPC) తీసుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.

కాలేజీలో జరిగిన ఒక సంఘటనను వివరిస్తూ.. సంస్కృతం సబ్జెక్టుపై ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పరీక్ష రాయగా కేవలం 4 మార్కులు మాత్రమే వచ్చాయని కేటీఆర్ తెలిపారు. దీనికి ఆగ్రహించిన సంస్కృతం మాస్టారు సీతారామయ్య గారు తన గూబ మీద ఒక్కటిచ్చారని, టీచర్లు కొడతారని తనకు అప్పుడే మొదటిసారి తెలిసిందని నవ్వుతూ చెప్పారు. ఆ దెబ్బతో పట్టుదల పెరిగి కష్టపడి చదివి ఇంటర్మీడియట్‌లో స్టేట్ 11వ ర్యాంక్ సాధించానని వెల్లడించారు.

కేటీఆర్ తన విద్యా నేపథ్యం గురించి చెబుతూ.. ఇంటర్ తర్వాత హైదరాబాద్‌లో డిగ్రీ, పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశానని తెలిపారు. ఆపై అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే ఆరేళ్ల పాటు ఉద్యోగం చేశానని వివరించారు. రాజకీయాల్లోకి రాకముందు తన వ్యక్తిగత మరియు విద్యా ప్రయాణంలోని ఈ చిరు జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు