కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  విజయ్ డ్రైవర్ కుమారుడి సంచలన విజయం: విరుగంబాక్కం ఎమ్మెల్యేగా శబరినాథన్ గెలుపు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) పార్టీ తరఫున మరో ఆసక్తికర విజయం నమోదైంది. నటుడు విజయ్ వద్ద గత 35 ఏళ్లుగా డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా (PA) పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు ఆర్. శబరినాథన్ విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమీప డీఎంకే అభ్యర్థి ప్రభాకరరాజాపై 27,086 ఓట్ల భారీ మెజార్టీతో శబరినాథన్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

30 ఏళ్ల శబరినాథన్ తన తండ్రి యజమాని అయిన విజయ్‌పై ఉన్న నమ్మకంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజేంద్రన్ విజయ్ నటించిన తొలి చిత్రం ‘నాలైయ తీర్పు’ కాలం నుండి ఆయన వెంటే ఉండటం గమనార్హం. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి, అసెంబ్లీకి పంపడం ద్వారా విజయ్ తన పార్టీలో సామాన్యులకు ఇచ్చే ప్రాధాన్యతను నిరూపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విజయం అనంతరం శబరినాథన్ మాట్లాడుతూ.. ఈ గెలుపును తన నాయకుడు విజయ్‌కు అంకితం ఇచ్చారు. తమిళనాడులో డీఎంకే పాలనకు విజయ్ ముగింపు పలికారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. విరుగంబాక్కం నియోజకవర్గ చరిత్రలో డీఎండీకే, అన్నాడీఎంకే, డీఎంకే తర్వాత ఇప్పుడు టీవీకే జెండా ఎగరడం విశేషం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు