శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను పట్టుకున్న ఆటో డ్రైవర్: జాహెర్ సాహసాన్ని అభినందించిన సీపీ సజ్జనార్

హైదరాబాద్‌ బేగంబజార్ పరిధిలో ఒక గొలుసు దొంగతనాన్ని అడ్డుకుని, రౌడీ షీటర్‌ను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. మార్నింగ్ వాక్ చేస్తున్న ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, జాహెర్ తన ఆటోతో నిందితుడిని అడ్డుకున్నారు. ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన జాహెర్‌కు సీపీ ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. దొంగతనం చేసి స్కూటీపై పారిపోతున్న రౌడీ షీటర్‌ను జాహెర్ తన ఆటోతో ఢీకొట్టారు. కిందపడిపోయిన నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా అతడిని బంధించి గోషామహల్ పోలీసులకు అప్పగించారు. సాహసం చేసిన అనంతరం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన జాహెర్‌ను, పోలీసులు సిసిటీవి ఫుటేజీ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. నిందితుడిపై గతంలో 16 కేసులు ఉన్నాయని, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సజ్జనార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోకుండా స్పందించిన జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్ అని కొనియాడారు. “ప్రతి పౌరుడిలో ఒక పోలీస్ ఉన్నాడు” అనే విషయాన్ని జాహెర్ నిరూపించారని, ఇలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల వల్లే నేరగాళ్లకు భయం పుడుతుందని పేర్కొన్నారు. నగరవాసులు కూడా నేరం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు